Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీటీహెచ్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు.. రంగంలోకి ట్రాయ్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:34 IST)
నాణ్యమైన కేబుల్ టీవీ, డీటీహెచ్ ప్రసారాల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం వద్దనే వద్దని ఆదిలోనే కేబుల్ టీవీ ప్రసారాల డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టారు. కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, ఒకటి, రెండు నెలలు గడిచిన తర్వాతగానీ కేంద్రం తీసుకొచ్చిన విధానం వల్ల వినియోగదారులపై విపరీతమైన భారం పడిందన్న విషయం బోధపడలేదు. 
 
అనేక ప్రైవేట్ చానళ్ల రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నెలవారి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. వీటిని చూసిన కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. డీటీహెచ్ ప్రసారాల ప్యాకేజీ ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెట్టసాగారు. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.ఆర్.ఏ.ఐ) రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16వ తేదీలోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని కోరింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments