Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెషర్స్‌‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్‌.. 40వేల మందికి క్యాంపస్ ద్వారా ఉద్యోగాలు

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:00 IST)
ఐటీ దిగ్గజం, కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తాజాగా ఫ్రెషర్స్‌‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు. 
 
గతేడాది వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్స్‌ వర్చువల్‌గా ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యారని టీసీఎస్‌ గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు.
 
ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే టీసీఎస్‌ ఈ శుభవార్త చెప్పింది. ఉద్యోగులను చేర్చుకునే క్రమంలో కొవిడ్‌ నిబంధనలు అడ్డంకిగా మారలేదని తెలిపారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌ గణపతి సుబ్రమణియమ్‌ తెలిపారు. 
 
ఖర్చు గురించి ఆందోళన లేదన్నారు. ఈ ఏడాది కూడా 40వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు లక్కడ్‌ చెప్పారు. వ్యాపార ఒప్పందాలు పుంజుకోగానే నియామకాలు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments