Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్ కొనేందుకు మైక్రోసాఫ్ట్ అనాసక్తత.. 45 రోజుల్లో ఆ డీల్‌ కష్టం

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:52 IST)
భారత్-అమెరికాల చేత నిషేధానికి గురైన టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపలేదు. టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్ దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఓ ఫిగర్ చెప్పిందట. కానీ ఆ మొత్తం టిక్‌టాక్‌కు నచ్చలేదట. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్ కొనుగోలుపై అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
 
ఇక మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.. టిక్‌టాక్‌ను కొనేందుకు ఆసక్తిగా ఉన్నా.. కేవలం 45 రోజుల్లో ఆ డీల్‌ను పూర్తి చేయడం కష్టమని భావిస్తోంది. టిక్‌టాక్‌ను కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. తరువాత టిక్‌టాక్ బ్యాన్ అవుతుందని చెప్పారు. అందుకు ఆయన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం కూడా చేశారు.
 
అయితే మరీ 45 రోజుల గడువు అంటే.. చాలా తక్కువ సమయమని, అంత తక్కువ వ్యవధిలో టిక్‌టాక్ లాంటి భారీ సంస్థను కొనాలంటే సమయం చాలదని ట్విట్టర్ భావిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ ఈ విషయమై ట్రంప్ ప్రభుత్వంపై లా సూట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తమకు మరింత ఎక్కువ గడువు కావాలని ట్విట్టర్ ట్రంప్ ప్రభుత్వంపై లా సూట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments