Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు శాంసంగ్ షాక్.. నోయిడాలో రూ.4,825 కోట్ల పెట్టుబడులు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:33 IST)
Samsung
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ సంస్థ చైనాకు షాక్ ఇచ్చింది. భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. శాంసంగ్‌ నోయిడాలో రూ.4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొబైల్, ఐటీ డిస్‌ ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించనుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే శాంసంగ్‌కు చెందిన తొలి హై-టెక్నిక్ ప్రాజెక్ట్‌గా దీన్ని చెప్పనున్నారు.
 
మిడ్-వేరియంట్ సెగ్మెంట్‌లో శాంసంగ్ మొబైల్స్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తూ ఉన్నారు. దీనితో పాటూ చైనా కంపెనీలను భారతీయులు దూరం పెడుతూ ఉండడంతో శాంసంగ్ భారతీయులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
 
యూపీ ప్రభుత్వం శాంసంగ్‌ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2017 ప్రకారం భూమిని బదిలీ చేయడంలో శాంసంగ్‌కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభించనుంది. అలాగే తయారీ ఎలక్ట్రానిక్ భాగాలు, సెమీ కండక్టర్ల ప్రమోషన్ కోసం భారత ప్రభుత్వ పథకం కింద ఇది 460 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments