Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై గూగుల్ నిర్ణయం.. 2022 వరకు..?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (14:26 IST)
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సైతం స్పందించింది. కరోనా విజృంభనతో కార్పోరేట్‌ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. 
 
అయితే వర్క్‌ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్‌ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్‌ఫ్రం హోంపై ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
 
కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్‌ వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపారు.
 
'2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం' అని మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments