Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లకు రూ.60 వేల కోట్ల లాభం చేకూర్చిన జియో.. అంబానీకి థ్యాంక్స్ అంటూ...

దేశంలోని మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో ఏకంగా రూ.60 కోట్ల లాభం చేకూర్చింది. అలాగే, ఉచితంగా వాయిస్ కాల్స్ పేరిట వినియోగదారులపై ధరల పెనుభారాన్ని తగ్గించింది.

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (07:47 IST)
దేశంలోని మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో ఏకంగా రూ.60 కోట్ల లాభం చేకూర్చింది. అలాగే, ఉచితంగా వాయిస్ కాల్స్ పేరిట వినియోగదారులపై ధరల పెనుభారాన్ని తగ్గించింది. దీంతో రిలయన్స్ జియో అధిపతి ముఖేష్ అంబానీకి నెటిజన్లతో పాటు మొబైల్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. ఈ రూ.60 కోట్ల లాభం వెనుక మతలబును పరిశీలిస్తే...
 
భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ రిలయన్స్ జియో. 2016 సెప్టెంబరు నెలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ఒక్క ఐడియాతో డేటా రేట్లను పాతాళానికి దింపేసింది. అప్పటివరకు వందలు, వేల రూపాయలు వసూలు చేసిన టెలికాం కంపెనీలు సైతం పోటీ పడి మరీ డేటా ప్యాకేజీలు తగ్గించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 
 
చివరకు ఉచిత డేటా ఆఫర్స్‌ను కూడా ఇవ్వాల్సి వచ్చింది. దీనికి కారణం జియో... జియో.. జియో. ఈ కంపెనీ సేవలు దేశీయ టెలికాం మార్కెట్‍లోకి వచ్చిన తర్వాత కస్టమర్లకు వచ్చిన లాభం ఎంతో తెలుసా.. అక్షరాల 60 వేల కోట్ల రూపాయలు. ఈ అంకెలు చూసి నోరెళ్లబెట్టొచ్చు కానీ.. ఇది అక్షర సత్యమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్‌నెస్ నివేదిక స్పష్టంచేసింది. 
 
2016 సెప్టెంబరులో సేవలు ప్రారంభించిన జియో.. తొలి ఆరు నెలల పాటు ఉచిత డేటాను ఇచ్చింది. ఆ తర్వాత రూ.149కే 28 రోజులు ప్రతి రోజు ఒక జీబీ డేటా ఇచ్చింది. జియోకి ముందు.. ఒక్క జీబీ డేటాకి రూ.152లను ఇతర టెలికాం కంపెనీలు వసూలు చేశాయి. ఈ లెక్కన గత యేడాదిన్నర కాలంలో భారతీయ వినియోగదారులకు డేటా రూపంలో 60 వేల కోట్ల రూపాయలు మిగిలింది.
 
అలాగే, జియో ఉచితంగా వాయిస్ కాల్స్ సదుపాయం కూడా ఇస్తుండటంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలోకి వచ్చాయి. ఈ రూపంలో కస్టమర్లు ఎంతో లాభపడ్డారు. ముఖ్యంగా, చుక్కల్లో ఉన్న డేటా ఛార్జీలను కిందకి దించి గ్రామీణులకు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోకే దక్కిందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో డేటా ఛార్జీలను తగ్గించిన జియో థ్యాంక్స్ చెబుతూనే.. 60 వేల రూపాయల లాభం చేకూర్చిన ముకేష్ అంబానీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెపుతున్నారు నెటిజన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments