Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు కుదిర్చిన అమ్మాయినీ, ప్రేమించిన అమ్మాయినీ... ఇద్దర్నీ....

ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరినీ కట్నం కోసం వేధించాడు. కట్నం తీసుకువస్తేనే ఇంటిని రమ్మన్నాడు. లేకుంటే మూడో పెళ్ళి చేసుకుంటానని బెదిరించాడు. న్యాయం కోసం పోలీస్టేషన్‌కు వెళితే పోలీసుపైన

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (21:03 IST)
ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరినీ కట్నం కోసం వేధించాడు. కట్నం తీసుకువస్తేనే ఇంటిని రమ్మన్నాడు. లేకుంటే మూడో పెళ్ళి చేసుకుంటానని బెదిరించాడు. న్యాయం కోసం పోలీస్టేషన్‌కు వెళితే పోలీసుపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ బయటకు పొమ్మన్నారు. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా సత్యవేడులో జరిగింది. 
 
సత్యవేడు పోలీస్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యాకూబ్ నాలుగు సంవత్సరాల క్రితం వరదయ్యపాళ్యెం మండలం వెంగరెడ్డి కండ్రిగకు చెందిన ప్రియాను వివాహం చేసుకున్నాడు. పెళ్ళయిన 6 నెలల వరకు బాగానే ఉన్నాడు. ఆ తరువాత కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి కాకముందే తాను ప్రేమించిన మరో అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే ఇంట్లోనే సంసారం పెట్టాడు. ఇదంతా ఇలా జరుగుతుంటే ఇద్దరినీ కలిపి కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఇద్దరూ అడిగినంత కట్నం ఇవ్వకుంటే మూడవ పెళ్ళి చేసుకుంటానని బెదిరించాడు. 
 
దీంతో ఏం చేయాలో తెలియక ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. భర్తపై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి... అతను కూడా పోలీసే.. మేము ఫిర్యాదు తీసుకోమన్నారు. దీంతో బాధితులు మీడియాను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments