Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేల్చిన రిలయన్స్ జియో : అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్... ఎయిర్‌టెల్ హడల్!

దేశీయ టెలికాం రంగంలోకి సంచలనాలతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో తాజాగా మరో బాంబు పేల్చింది. జియో కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ టారిఫ్ ప్లాన్స్‌న

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:36 IST)
దేశీయ టెలికాం రంగంలోకి సంచలనాలతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో తాజాగా మరో బాంబు పేల్చింది. జియో కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేసే పనిలోనే ఉన్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఇది ఎయిర్ టెల్ వంటి ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
 
నిజానికి ఈ కంపెనీ సేవలు ప్రారంభంకాగానే, ఇతర కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్‌లతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.... ఆ తర్వాత కూడా వివిధ రకాల ఆఫర్లతో ఇతర కంపెనీలను బెంబేలెత్తించింది. ఈ నేపథ్యంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టగా, దానికి ట్రాయ్ అడ్డుచెప్పింది. దీంతో దాన్ని జియో ఉపసంహరించుకుంది. ట్రాయ్ హెచ్చరికలతో జియో వెనక్కి తగ్గడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి. 
 
కానీ రిలయన్స్ జియో తాజా ప్రకటనతో మళ్లీ ప్రత్యర్థి కంపెనీల వెన్నులో వణుకు పుడుతోంది. టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నామని, త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. జియో వల్లే డిజిటల్ ఇండియా సాధ్యమవుతుందని సోషల్ మీడియా వేదికగా మెజార్టీ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జియో మళ్లీ ఏ ఆఫర్ ప్రకటించి తమ కొంప ముంచుతుందోనని ఇతర కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments