Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీయో నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం.. సేవల్లో అంతరాయం..!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (13:42 IST)
దేశంలో ప్రైవేట్ మొబైల్ దిగ్గజ ఆపరేటింగ్ సంస్థగా ఉన్న జియో సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈ కంపెనీ నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. 
 
నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అదేసమయంలో జియో నెట్‌వర్క్‌లో అంతరాయంపై వినియోగదారులు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. 
 
భారత్‌లో జియోడౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు డౌన్‌ డిటెక్టర్‌ తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ సమస్యను నివేదించారు. అయితే, ఈ సమస్య తాత్కాలికమేనని, పరిష్కారం కోసం తమ బృందం పనిచేస్తున్నట్లు కస్టమర్ కేర్ నుంచి సమాధానం వచ్చినట్లు చెప్పింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments