Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో-ఎయిర్‌టెల్ 4జీ నెట్వర్కుల్లో ఏది బెస్ట్ తెలుసుకుందామా? అదే బెస్ట్.. ఏది..?

రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. రిలయన్స్‌కు పోటీగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్‌తో పాటు ప్రైవేట్ టెలికాం సంస్థలు సైతం వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి.

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (18:22 IST)
రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. రిలయన్స్‌కు పోటీగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్‌తో పాటు ప్రైవేట్ టెలికాం సంస్థలు సైతం వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. కస్టమర్లకు జియో ఉచిత డేటా ఆఫర్‌ను ప్రకటిస్తే.. ఎయిర్ టెల్ 4 జీ నెట్‌వర్క్‌తో ముందుకొచ్చింది.

రూ.50లకు ప్రారంభమయ్యే జియో చెల్లింపులు 10 జీబీ వరకు నెల పాటు 4 జీ సేవలను అందిస్తుండగా.. ఎయిర్ టెల్ సంస్థ రూ.249కి 1 జీబీ అన్ లిమిటెడ్ 3జీ/4జీ ఆఫర్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక వొడాఫోన్ సంగతికొస్తే.. రూ.252లకు 1జీబీతో పాటు అన్‌లిమిటెడ్ 4జీ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది. 
 
ఎయిర్ టెల్ వన్ ఇయర్ ప్లాన్స్ :
ఇటీవల ఎయిర్ టెల్ ఏడాది రీఛార్జ్‌కు సంబంధించిన కొత్త ప్లాన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.1,498 రీఛార్జ్ చేస్తే.. 1జీబీ అన్ లిమిటెడ్ 4జీ సేవలు లభిస్తాయి. అంటే నెలకు రూ.51లు మాత్రమే చెల్లించినట్లవుతుంది. 
 
రిలయన్స్ జియో నుంచి 60 జీబీ :
రిలయన్స్ జియో ప్లాన్స్ విషయానికి వస్తే.. రూ.400లకు 60 జీబీ అన్ లిమిటెడ్ 4జీ సేవలను ఇస్తోంది. ఈ ఆఫర్ 30 రోజులకు మాత్రమే వర్తిస్తుంది.
 
ఎయిర్ టెల్ 20 జీబీ:   
రిలయన్స్ జియోకు పోటీగా నిలిచే ఎయిర్ టెల్ నెలకు 20 జీబీతో కూడిన డేటాను రూ.1,989లకు అందిస్తోంది. 
 
ఎయిర్ టెల్, వొడాఫోన్ :
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఆఫర్లలో ఉచిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ స్కీమ్‌లుండవు. రిలయన్స్ జియోలో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు నెలసరి ఉచిత డేటా లభిస్తుంది. కానీ ఎయిర్ టెల్, వొడాఫోన్‌ ఆఫర్లలో వాయిస్ కాల్స్‌కు, ఎస్సెమ్మెస్‌లకు నగదు చెల్లించాల్సి వుంటుంది. సో.. జియో-ఎయిర్‌టెల్- వొడాఫోన్‌ డేటా ప్లాన్లలో  జియోనే బెస్ట్ కదూ..

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments