Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్లకు ఎక్స్‌గ్రేషియా రూ.2లక్షలేనా.. వాళ్ళేమైనా ముష్టివారా? దీదీపై నెటిజన్ల ఫైర్

ప్రమాదాల్లో మరణించిన వాళ్లకు లక్షలు, కోట్లు కుమ్మరిస్తూ.. వారి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలున్నాయి. కానీ యూరీ ఘటనలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (18:06 IST)
ప్రమాదాల్లో మరణించిన వాళ్లకు లక్షలు, కోట్లు కుమ్మరిస్తూ.. వారి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలున్నాయి. కానీ యూరీ ఘటనలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన నష్టపరిహారంపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఉరీ ఉగ్రదాడిలో అమరులైన ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మమతా బెనర్జీ నష్ట పరిహారం ప్రకటించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమర జవాన్లు ముష్టివాళ్ళు కాదనే హేష్ ట్యాగ్‌తో నెటిజన్లు దీదీపై విరుచుకుపడుతున్నారు. ఆ రెండు లక్షలు కూడా మీరే ఉంచుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగించండి అంటూ కొందరు ఎద్దేవా చేశారు.
 
గత ఏడాది మక్కా తొక్కిసలాటలో మృతి చెందిన ఓ బాధిత కుటుంబానికి పది లక్షలిచ్చిన మమతా బెనర్జీ.. అమరులైన జవాన్ల ప్రాణాలకు మాత్రం రూ.2లక్షలే వెలగట్టారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా జవాన్ల ప్రాణాలకు ఆ మాత్రం విలువ లేదా అంటూ అడుగుతున్నారు. దేశం కోసం శత్రువులతో పోరాడి.. వారిని ధీటుగా ఎదుర్కొని.. ప్రాణాలు అర్పించిన జవాన్లకు మమతా బెనర్జీ ఇచ్చే గౌరవం, పరిహారం ఇదేనా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతూ పోస్టులు చేస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments