Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సేవలకు యేడాది పూర్తి ... వరుసగా ఏడోసారి రికార్డు...

రిలయన్స్ జియో... పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని ఈ కంపెనీ సెప్టెంబర్ 5వ తేదీన తొలి బర్త్‌డేను జరుపుకుంది. ఈ కంపెనీ దేశంలో టెలికాం సేవలు ప్రారంభించి ఒక యేడాది పూర్తి చేసుకుంది. అదేసమయంలో వరస

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (06:07 IST)
రిలయన్స్ జియో... పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని ఈ కంపెనీ సెప్టెంబర్ 5వ తేదీన తొలి బర్త్‌డేను జరుపుకుంది. ఈ కంపెనీ దేశంలో టెలికాం సేవలు ప్రారంభించి ఒక యేడాది పూర్తి చేసుకుంది. అదేసమయంలో వరసగా ఏడోసారి రికార్డును సొంతం చేసుకుంది. 
 
అత్యధిక వేగంతో డేటాను అందించే నెట్‌వర్క్‌గా రిలయన్స్‌ జియో వరుసగా ఏడోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్‌ 5, 2016న సేవలను ప్రారంభించిన జియో నేటితో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. 
 
ట్రాయ్‌ నిర్దేశించిన ప్రమాణాలతో డేటాను అందిస్తున్న వాటిలో జియో తర్వాత స్థానంలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు నిలిచాయి. జులై నెలకుగాను 18.331 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను జియో నెట్‌వర్క్‌ నుంచి వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 
 
ఎయిర్‌టెల్‌ 8.833 ఎంబీపీఎస్‌, ఐడియా సెల్యులార్‌ 8.833, వొడాఫోన్‌ (ఇండియా) 9.325 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను కలిగి ఉన్నాయి. ఏడాది కాలంలో డేటా వినియోగం 20 కోట్ల జీబీ నుంచి 150 కోట్ల జీబీకి చేరింది. ఒక్క జియో నుంచే నెలకు 100జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు సమాచారం.
 
ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియో ఐదు రెట్ల డేటా వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది జులై 21 నాటికి జియో వినియోగదారుల సంఖ్య 100 మిలియన్లకు చేరిన సంగతి తెలిసిందే. కేవలం 170 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్‌ అదుర్స్

సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి హోలీ న్యూ పోస్టర్‌

మెగాస్టార్ చిరంజీవికి యుకె పార్ల‌మెంట్‌‌లో స‌న్మానం

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments