Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం రోజుల్లో ఇంటికే జియో సిమ్.. జియోతో జరభద్రం.. హ్యాకర్ గ్రూప్ వార్నింగ్..

రిలయన్స్ జియో కోసం రిలయన్స్ షాపుల వెంట బడుతున్నారా? ఇక ఆ పని చేయాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చునే జియో సిమ్ పొందవచ్చు. నిజమే అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆన్ లైన్లో జియో సిమ్ కోసం పొందే దిశగా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:30 IST)
రిలయన్స్ జియో కోసం రిలయన్స్ షాపుల వెంట బడుతున్నారా? ఇక ఆ పని చేయాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చునే జియో సిమ్ పొందవచ్చు. నిజమే అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆన్ లైన్లో జియో సిమ్ కోసం పొందే దిశగా త్వరలోనే రిలయన్స్‌ జియో ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించబోతోంది.

సిమ్‌ పొందడంలో వినియోగదారుల ఇబ్బందిని గుర్తించిన జియో యాజమాన్యం.. డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పోర్టల్‌లో వినియోగదారులు వారి సమాచారాన్ని, చిరునామాను నమోదు చేస్తే వారం రోజుల్లోపే సిమ్‌ ఇంటికి వచ్చేస్తుంది. దీంతో కస్టమర్లు ఎగిరి గంతేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ముకేష్ అంబానీ గ్రూప్ వారి రిలయెన్స్ జియో సర్వీసులపట్ల జర భద్రంగా ఉండాలని ఓ హ్యాకర్ గ్రూప్ హెచ్చరిస్తోంది. యూజర్లకు చౌకలో 4జీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి ఎన్నో తాయిలాలు ప్రకటించిన ఈ సర్వీసెస్ మీరనుకున్నంత భద్రం కాదని ఎనానిమస్ అనే ఈ హ్యాకర్ గ్రూప్ వార్నింగ్ ఇస్తోంది. జియో యూజర్ల కాల్ సమాచారాన్ని ఈ సంస్థ విదేశాలకు చేరవేస్తోందని తన టుంబ్లర్ ఖాతాలో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments