Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిల‌య‌న్స్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ కాలింగ్ యాప్‌.. రూ.100తో లాగిన్ అయితే చాలు...

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎలాంటి పిన్ నంబ‌ర్లు అవ‌స‌రం లేకుండానే ప్రపంచంలోని ఏ దేశానికైనా కాల్స్ చేసుకునేలా ఈ యాప్‌

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (10:37 IST)
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎలాంటి పిన్ నంబ‌ర్లు అవ‌స‌రం లేకుండానే ప్రపంచంలోని ఏ దేశానికైనా కాల్స్ చేసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను రిల‌య‌న్స్ గ్లోబ‌ల్ కాల్‌(ఆర్జీసీ) శుక్ర‌వారం విడుద‌ల చేసింది. 
 
ఈ యాప్ సాయంతో టోల్‌ఫ్రీ, పిన్ నంబ‌ర్లు అవ‌స‌రం లేకుండానే ప్ర‌వంచ వ్యాప్తంగా ఏ నంబ‌రుకైనా కాల్స్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం వంద రూపాయల‌తో తొలిసారి లాగిన్ అవాల్సి ఉంటుంది. వీరికి రూ.200 టాక్ టైమ్ అందిస్తామ‌ని రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్‌కు అనుబంధ సంస్థ ఆర్జీసీ పేర్కొంది. 
 
నిమిషానికి రూ.1.4 చొప్పున చార్జీ వ‌సూలు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అన్ని మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌ఫోన్ల వినియోగ‌దారుల‌తోపాటు రిల‌య‌న్స్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌, ఐడియా, టాటా, ఎంటీఎస్ నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన ప్రీ, పోస్టుపెయిడ్ వినియోగ‌దారులు కూడా ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చ‌ని సంస్థ పేర్కొంది. 
 
ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌, ఐవోఎస్ యాప్ స్టోర్ల ద్వారా ఆర్జీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చ‌ని రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ సీఈవో గురుదీప్ సింగ్ తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments