Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ 5 నిమిషాల్లో చార్జింగ్.. రెడ్మీ 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ చార్జర్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (14:23 IST)
స్మార్ట్ మొబైల్స్ తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న రెడ్మీ కంపెనీ ఇపుడు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రూపొందించిద. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో మొబైల్ చార్జింగ్ పూర్తికానుంది. ఈ టెక్నాలజీ ద్వారా 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ సెకండ్ చార్జర్ కేవలం ఐదు నిమిషాల్లోనే చార్జ్ చేస్తుందని తెలిపింది. అయితే, చార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అంశాలను చైనా ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్మీ స్పష్టంగా నిర్ధారించాల్సివుంది. 
 
సాధారంగా స్మార్ట్ ఫోన్ వినియోగంచే ప్రతి ఒక్కరూ చార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ఛార్జింగ్ సమస్యను కనిపెట్టారు. అత్యంత ప్రాముఖ్యత పొందిన ఫీచర్. ఇది వినియోగదారులకు తమ పరికరాలను సాధారణం కంటే చాలా వేగంగా రీచార్జ్ చేయడానికి దోహదపడుతుంది. 
 
ఈ రెడ్మీ వెబ్‌సైట్ ప్రకారం. ఈ కొత్త చార్జింగ్ టెక్నాలజీకి 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ సెకడ్ చార్జర్ అని పేరు పెట్టారు. ఇది ప్రత్యామ్నాయ చార్జింగ్ టెక్నాలజీగా భావిస్తున్నారు. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ 4,100mAh బ్యాటరీని 43 సెకన్లలో 10 శాతం, రెండు నిమిషాల 13 సెకన్లలో 50 శాతం మరియు ఐదు నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. 
 
ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ ఏమీ కాదని, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్‌లో ఉన్న ఛార్జింగ్ టెక్నాలజీ కి ఇది ఒక మార్పు అని కంపెనీ పేర్కొంది. రెడ్ మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్, చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, ఇప్పటి వరకు కంపెనీ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇది 210W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దాదాపు 10 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments