Redmi 12 సిరీస్‌ - బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్? ఫీచర్లు, ధర వివరాలు

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:54 IST)
Redmi 12
Redmi 12 సిరీస్‌ను రెడ్‌మీ భారతదేశంలో ప్రారంభించింది. ఇది 4G, 5G వేరియంట్‌లను కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకర్షించింది. తాజాగా Redmi 12 సేల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, వేరియంట్ల ఫీచర్లు, ధర వంటి వివరాలను తెలుసుకుందాం.  
 
ఈ రెండు మొబైల్స్ జేడ్ బ్లాక్, పాస్టెల్ బ్లూ, మూన్‌స్టోన్ సిల్వర్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు కూడా ఒకేలా ఉన్నాయి. 
Redmi 12 5Gలో Qualcomm Snapdragon 4 Gen 2 SoC చిప్‌సెట్ ఉండగా, 4G మోడల్‌లో MediaTek Helio G88 12nm SoC ప్రాసెసర్ ఉంది. రెండూ 6.79-అంగుళాల పూర్తి HD ప్లస్ 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 
 
రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా కూడా రాబోతోంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
 
ఈ Redmi 12 Redmi 11కి సక్సెసర్‌గా వస్తోంది. 
Redmi 12 4G (4GB RAM – 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 8,999. 
6GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. 
5G మోడల్ 4GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 
6GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. 
8GB RAM-256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments