చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం అయిన రియల్‌మి కంపెనీ అతి తక్కువ ధరకు వినియోగదారులకు రూ.9వేలకే ఫోన్ అందించనుంది. రియల్‌మీ సీ21వై ద్వారా పలు ఫీచర్‌లను వినియోగదారులకు అందించనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 23, 2021న ఇండియాలో లాంచ్ చేసింది. మొత్తం మీద రియల్‌మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది. అందుబాటు ధరలే కాకుండా రియల్‌మీ సీ21వై క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.