రియల్ మీ 5జీ సిరీస్ అదుర్స్.. ఫీచర్స్ ఇవే.. భారత్‌లో ఏప్రిల్ 22న..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:37 IST)
Realme 8 5G series
రియల్ మీ వినియోగదారులకు గుడ్ న్యూస్. రియల్ మీ 8 సీరిస్‌లో 5జీ ఫోన్లు త్వరలో ఆవిష్కృతం కానున్నాయి. రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రో ఫోన్లు మనదేశంలో ఏప్రిల్ 22న ప్రారంభం కానుండగా, ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు మొదట మలేషియాలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 21న మలేషియాలో, ఏప్రిల్ 22న ఇండియాలో రిలీజ్ కానున్నాయి.
 
రియల్ మీ 8 5జీలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ తోపాటు డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉండనుంది. ప్రైమరీ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ తో ఉన్న మూడు కెమెరాల సెటప్ రానుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ తో అందించనున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదేనని పేర్కొంది.
 
రియల్ మీ 8 5జీలో 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 తో పనిచేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 185 గ్రాములుగానూ ఉంది. 5జీ, వైఫై, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
 
ఫీచర్స్ సంగతికి వస్తే...
6.5 ఎల్సీడీ 90హెచ్ డిస్‌ప్లే, 
600 నిట్స్ బ్రైట్ నెస్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
డైమన్సిటీ 700  
185 గ్రాముల బరువు, 8.5ఎంఎంల మందం 
128 జీబీ ధర రూ.17,860గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments