చౌకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఫోన్ ఇదే..

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (15:23 IST)
5G technology
ఇంగ్లండ్‌లో జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో రియల్‌మీ 5జీ ఫోన్‌ లాంఛ్ అయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో, రియల్ మీ 7ఐలకు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అత్యంత చౌకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్ ఇదే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ వీ5నే రీ బ్రాండ్ చేసి రియల్‌మీ 7 5జీగా లాంచ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ రియల్‌మీ ఈ ఫోన్‌లో పలు మార్పులు చేసింది. 
 
రియల్‌మీ వీ5లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను తీసుకురాగా, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 279 యూరోలుగా (సుమారు రూ.27,400) నిర్ణయించారు. ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బాల్టిక్ బ్లూ రంగులో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇంగ్లండ్‌లో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియాల్సి ఉంది.
 
రియల్ మీ 7జీ స్పెసఫికేషన్లు 
కొత్త స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. 
రియల్‌మే 7 5 జీలో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి.
ఫ్రంట్‌లో హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను అందిస్తుంది. 
 
డిస్ ప్లే-6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 
ప్రాసెసర్‌-మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ
ర్యామ్-6 జీబీ
స్టోరేజ్-128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డు(256 జీబీ)
కనెక్టివిటీ-5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై
కలర్-బాల్టిక్ బ్లూ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments