కరోనా వైరస్ ప్రభావంతో చైనా స్మార్ట్ ఫోన్లకు క్రేజ్ తగ్గిపోయింది. దీంతో భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్‌కు క్రేజ్ పెరిగింది. భారతదేశంలో కొత్త 'ఇన్' స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో తిరిగి వచ్చింది. ఈ లైనప్‌లో రెండు హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఒకటి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, రెండోది మైక్రోమాక్స్ ఇన్ 1 బీ. ఈ రెండూ మీడియాటెక్ హెలియో ప్రాసెసర్‌లచే ఆధారితంగా భారతదేశంలోనే తయారవుతున్నాయి.
రెండు ఫోన్‌లను మంగళవారం నాడు మైక్రోమాక్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఆవిష్కరించారు. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్.కామ్‌తోపాటు మైక్రోమాక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు.
ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో పాగావేసేందుకు, చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు గట్టి పోటీనిస్తాయని రాహుల్ శర్మ నొక్కి చెప్పారు. ఏదైనా ఉత్పత్తిని కొనడానికి ముందు లోతుగా పరిగణించి చేయాలని, భారత తయారీ అని పక్కన పెట్టేయవద్దని శర్మ పేర్కొన్నాడు.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.10,999గా ఉండగా, 4జీబీ+ 128జీబీ వేరియంట్ మోడల్‌కు రూ.12,499 గా నిర్ణయించారు. రెండో ఫోన్ ఇన్ 1 బీ రకంలో 2 జీబీ + 32 జీబీకి రూ. ధర రూ. 6,999గా ఉండగా, 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ. 7,999 గా ఉన్నది.