భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 82 లక్షల 67వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 38,310 కేసులు నమోదు కాగా 490 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 58,323 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 82,67,623 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,41,405 ఉండగా 76,03,121 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 1,23,097మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 91.96 శాతంగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.49 శాతానికి మరణాల రేటు తగ్గింది. యాక్టివ్ కేసుల శాతం 6.55గా ఉంది.