హీరో ఎలక్ట్రిక్ సంస్థ దీపావళి పండగ వేళ బంపరాఫర్ ప్రకటించింది. స్కూటీల కొనుగోళ్లపై కస్టమర్లకు రూ.6000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. కొత్త స్కూటీల కొనుగోలుపైనే కాకుండా పాత వాహనాల ఎక్స్ఛేంజ్‌పైనా ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.5వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 500 డీలర్ల నుంచి ఈ ఆఫర్లను పొందవచ్చని హీరో ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది. లీడ్‌యాసిడ్ స్కూటర్ల మోడల్స్‌పై రూ.3,000 డిస్కౌంట్ అందిస్తుండగా.. ఇతర ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
అంతేగాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో వడ్డీ లేని రాయితీ (జీరో పర్సెంట్ వడ్డీ) సదుపాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. మూడు రోజుల రిటర్న్ పాలసీ సదుపాయంలో భాగంగా కొన్ని మోడళ్ల వాహనాలపై మరో రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. పరిమిత కాలపు ఈ ఆఫర్లు నవంబర్ 14 వరకే వర్తిస్తాయని తెలిపింది.