Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాను సెప్టెంబర్ 1లోపు ఆధార్‌తో లింక్ చేయాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (10:35 IST)
ఉద్యోగులు తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాను వచ్చేనెల 1లోపు ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. ఆధార్‌తో అనుసంధానం చెందని పీఎఫ్‌ ఖాతాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని చెల్లింపులను నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 సెక్షన్‌ 142 నిబంధనను ఉటంకించింది. 
 
ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల సమాచారం వాళ్లు పనిచేసే సంస్థల దగ్గర ఉండటం వల్ల.. యాజమాన్యమే ఉద్యోగి ఆధార్‌ను పీఎఫ్‌ ఖాతాతో అనుసంధానించాలని ఈపీఎఫ్‌వో ఒక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఎల్‌ అండ్‌ ఎల్‌ పార్టనర్స్‌ డైరెక్టర్‌ అమృత టోంక్‌ అన్నారు. కాగా, పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ఈపీఎఫ్‌వో.. తొలుత జూన్‌ 1ని తుది గడువుగా పేర్కొంది. తాజాగా ఆ తేదీని సెప్టెంబర్‌ 1కి పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments