Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్.. ధర రూ.6,499 మాత్రమే..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:37 IST)
షావోమీకి చెందిన సబ్ బ్రాడ్ పోకో కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోను ధరను కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. అత్యాధునిక ఫీచర్లతో పోకో కంపెనీ ఈ స్మార్ట్ ఫోనును తయారు చేసింది. పోకో సీ50 పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోనును రెండు వేరియంట్లలో రూపొందించారు. 2జీబీ వేరియంట్ ధర రూ.6,499గా నిర్ణయించగా, 3జీబీ వేరియంట్ ధర రూ.7,299గా ఖరారు చేశారు. అయితే, ప్రారంభ ఆఫర్ ధరగా రూ.6,249, రూ.6,999గా లభించనుంది. 
 
ప్రస్తుత దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోనులో 6.5 అంగుళాల హెచ్.డి.ప్లస్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 12గో ఎడిషన్‌, ఫింగర్ ఫ్రింట్ స్కానర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, లెదర్ లైక్ టెక్సర్ డిజైన్‌తో లభించనుంది. 
 
వెనుకభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జ్‌తో ఉంటుంది. ఫ్లిప్ కార్టులో ఈ నెల 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు. రాయల్ బ్లూ, కంట్రీ బ్లూ రంగుల్లో ఈ ఫోను లభించనుంది. అయితే, ఇది బేసిక్ ఫోన్. గేమింగ్‌కు ప్రత్యేకమైన అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments