Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ కనిపించిన పేటీఎం..

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:48 IST)
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా తీసి వేసిన కొన్ని గంటలకే పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. ఈ విషయాన్ని పేటీఎం కంపెనీ ట్వీట్ చేసింది. 
 
కానీ పేటీఎం గేమ్స్ యాప్ మాత్రం ఇంకా ప్లే స్టోర్ లోకి రాలేదు. గూగుల్ ప్లే స్టోర్ శుక్రవారం నాడు పేటీఎంకు షాక్ ఇచ్చింది. పేటీఎంను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. పేటీఎంలో జూదాన్ని ప్రోత్సహించే ఫీచర్లు ఉండటంతో గూగుల్‌ పేటీఎంను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. కానీ కొన్ని గంటల తర్వాత పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించింది.
 
కానీ అంతకుముందు పేటీఎంతోపాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను సైతం మొదట తొలగించింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉండగా పేటీఎం, పేటీఎం గేమ్స్ యాప్‌లను మొదట తీసివేసింది. గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
గతంలో పేటీఎంకు గూగుల్‌ నోటీసులు జారీ చేసింది. తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గూగుల్‌ నిబంధనల ప్రకారం యాప్స్ ఎలాంటి జూదాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ పేటీఎం, పేటీఎం ఫస్ట్‌ గేమ్‌ యాప్స్‌ ద్వారా ఫాంటసీ క్రికెట్‌ సేవలను ప్రారంభించడం గూగుల్‌కు నచ్చలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments