నేపాల్ దుస్సాహసం..పాఠ్యాంశంగా భారత భూభాగం చేర్చిన మ్యాప్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:44 IST)
పొరుగునున్న నేపాల్ ప్రభుత్వం దుస్సాహసానికి దిగింది. చైనా అండ చూసుకుని మిడిసిపాటు ప్రదర్శిస్తోంది. భారత్‌తో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడుతూ, సవరించిన దేశ భౌగోళిక రాజకీయ మ్యాప్‌ను ఆ కొత్త పుస్తకాల్లో చేర్చింది.

వ్యూహాత్మకంగా కీలకమైన మూడు భారతదేశ ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో కలిపివేసినట్లుగా అందులో చూపించింది. భారతదేశానికి చెందిన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాదురా ఈ మూడు ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా చూపిస్తున్న కొత్త రాజకీయ మ్యాప్‌ను నేపాల్‌ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల భారత్‌ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ కృత్రిమ ఆక్రమణలను తాము సహించబోమని ఖండించింది. నేపాల్‌ విద్యా శాఖకు చెందిన కరిక్యులమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఇటీవలనే సవరించిన మ్యాప్‌తో కూడిన పుస్తకాలను ప్రచురించిందని సమాచార శాఖ అధికారి గణేష్‌ భట్టారారు తెలిపారు. 9, 12 తరగతుల సిలబస్‌లో వీటిని చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments