ఒప్పోకి కరోనా సెగ.. ఆరుగురు ఉద్యోగులకు కరోనా.. కంపెనీ షట్ డౌన్

Webdunia
సోమవారం, 18 మే 2020 (13:08 IST)
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పోకి కూడా కరోనా సెగ తాకింది. ఒప్పోకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఒప్పో.. ఫలితంగా యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలటంతో కంపెనీలోని మరో మూడు వేలమంది ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నోయిడా పారిశ్రామిక వాడలోని ఒప్పో మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోవటం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల సడలింపులతో తిరిగి మే 8న కంపెనీ ప్రారంభమైంది. 
 
అయితే ప్రస్తుతం ఒప్పోలో పనిచేసే మూడు వేలకుపైగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. మూడు వేల మంది ఉద్యోగుల కరోనా టెస్టు ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు ఒప్పో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments