Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా యాప్స్‌పై నిషేధంపై ఎత్తివేత.. ఐటీశాఖ మంత్రి ఏమన్నారు?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (13:04 IST)
ప్రముఖ చైనా యాప్స్‌పై నిషేధం విధించి ఏడాదికి పైగా సమయం గడుస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశం చైనా యాప్స్‌పై నిషేధాన్ని ఉపసంహరించుకుంటుందనే వార్తలు మొదలయ్యాయి.
 
లోక్‌సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చైనా యాప్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ యాప్స్ నిషేధాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని ఓ లిఖితపూర్వక పత్రం అందించారు. 
 
దీంతో పబ్‌జీ, టిక్‌టాక్‌, విబో, వీచాట్‌, అలీఎక్స్‌ప్రెస్‌, యూసీ బ్రౌజర్ వంటి అప్లికేషన్లు ఇప్పట్లో ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. 2020, జులై 29న 59 యాప్‌లు, సెప్టెంబర్‌ 2న మరో 118 యాప్‌లను, నవంబరులో 43 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
 
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఏ కింద బ్యాన్ విధించినట్లు అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో చైనా దేశం చాలా నష్టపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments