Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన గూగుల్ ఉద్యోగులు.. నిరసన కార్యక్రమంలో సుందర్ పిచాయ్ కూడా...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ప

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:30 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా పాల్గొనడం గమనార్హం. 
 
అమెరికా హెచ్1బీ వీసాల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఇది భారత ఐటీ ఉద్యోగులతో పాటు.. ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరి మనోభావాలను గూగుల్ ఉద్యోగులు కూడా పంచుకుంటున్నారు. సోమవారం వేలాదిమంది గూగుల్‌కు చెందిన వివిధ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఇంక్‌.కు చెందిన దాదాపు 2000 మంది ఉద్యోగులు వివిధ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
 
కాలిఫోర్నియా, మౌంటెన్ వ్యూలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ వలస వచ్చినవారే కావడం విశేషం. ముస్లింలు అధికంగా ఉన్న 7 దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించడంపై పరిమితులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై పిచాయ్, బ్రిన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments