Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడి భీష్మ ప్రతిజ్ఞ - వీరాభిమాని కోర్కె తీర్చిన షియోమీ!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:27 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న కంపెనీల్లో షియోమీ ఒకటి. ఈ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతాకాదు. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో లభ్యమయ్యే ఫోన్లను షియోమీ అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఈ కంపెనీ ఫోన్లకు భలే డిమాండ్ ఉంది. ఈ కారణంగానే భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ అగ్రగామిగా కొనసాగుతోంది.
 
అయితే, కమల్ అహ్మద్ అనే యువకుడికి షియోమీ ఫోన్ల వీరాభిమాని. ఈ క్రమంలో ఇటీవల షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోనును కొనాలన్నది అతని కోరిక. అయితే వేలాది రూపాయలు చెల్లించి కొనలేని స్థితి. దీనికి కారణం ఆయన ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. 
 
ఈ క్రమంలో షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ ఫోన్‌ను కొనేందుకు డబ్బులు పొదుపు చేస్తున్న కమల్... ఈ ఫోన్‌ను కొనేవరకు తాను పెళ్లి చేసుకోబోనని ఫన్నీగా ట్వీట్ చేశాడు.
 
ఈ ట్వీట్ కాస్త షియోమీ కంపెనీ భారత బృందానికి చేరింది. ఈ ట్వీట్‌ను షియోమీ పరిగణనలోకి తీసుకుంది. వెంటనే అతడు కోరుకున్న లేటెస్ట్ మోడల్ ఫోన్‌ను ఉచితంగా పంపించింది. అనంతరం, షియోమీ ఇండియా అధిపతి మనుకుమార్ జైన్ స్పందిస్తూ... 'ఇప్పుడిక నువ్వు పెళ్లికి సిద్ధం అనుకుంటా!' అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments