Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు సమాచారం వ్యాప్తికి వ్యతిరేకంగా అవగాహనకై మెటా ‘నో వాట్స్ రియల్’ ప్రచారం

ఐవీఆర్
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (23:17 IST)
టి డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారంతో పోరాడటం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో మెటా ‘నో వాట్స్ రియల్’  అనే సమగ్ర భద్రతా ప్రచారాన్ని ప్రారంభించింది. డిజిటల్ బెస్ట్ ప్రాక్టీస్‌లను ప్రోత్సహించడం, అందుబాటులో ఉన్న భద్రతా సాధనాలను హైలైట్ చేయడం ద్వారా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, పరిష్కరించడంపై వినియోగదారులకు అవగాహన కల్పించడం ఈ ప్రచారం లక్ష్యం.
 
8 వారాల పాటు సాగే ఈ ప్రచారం వాట్సాప్‌లో బ్లాక్, రిపోర్ట్ వంటి ఇన్-బిల్ట్ ప్రోడక్ట్ ఫీచర్‌లు, భద్రతా చర్యలను హైలైట్ చేస్తుంది, తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వినియోగదారులను సన్నద్ధం చేసే వాట్సాప్ ఛానెల్‌లలోని ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు ద్వారా  ఫార్వర్డ్ లేబుల్‌లు, అనుమానాస్పద లేదా సరికాని సమాచారాన్ని ధృవీకరించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో, సమాచారాన్ని వెరిఫై చేయడానికి ఫ్యాక్ట్ చెకర్‌ల యొక్క బలమైన నెట్‌వర్క్‌తో మెటా జట్టుకట్టింది. డీప్‌ఫేక్‌ల వంటి తప్పుడు అంశాలు  ఏవైనా కనుగొనబడితే, అవి ఖచ్చితమైనవి కాదని ప్రజలకు తెలియజేయడానికి వారు యాప్‌లో హెచ్చరిక లేబుల్‌లను ఉంచారు. మేము మా ఫ్యాక్ట్ చెక్స్ "తప్పు" అని లేబుల్ చేసిన కంటెంట్‌ను కూడా పరిమితం చేస్తాము, కాబట్టి తక్కువ మంది వ్యక్తులు దానిని చూడగలరు. ఈ ప్రచారం ద్వారా, మెటా ఎటువంటి అసమంజసమైన కంటెంట్‌ను ఫార్వార్డ్ చేయవద్దని లేదా షేర్ చేయవద్దని ప్రజలను ప్రోత్సహిస్తోంది, బదులుగా సమాచారాన్ని ధృవీకరించడానికి ఫిర్యాదు అధికారికి లేదా స్వతంత్ర వాస్తవ తనిఖీ భాగస్వాములలో ఎవరికైనా నివేదించ వలసినదిగా కోరుతుంది.
 
భారతదేశంలోని మెటా యొక్క వాస్తవ-తనిఖీ కార్యక్రమం 11 స్వతంత్ర వాస్తవ-తనిఖీ సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా వాస్తవ-తనిఖీ భాగస్వాముల యొక్క అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ భాగస్వాములు తెలుగుతో పాటు ఇంగ్లీషుతో సహా 15 భారతీయ భాషల్లోని కంటెంట్‌ను వాస్తవంగా తనిఖీ చేయగల సామర్థ్యాలను కలిగి ఉన్నారు. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని నిరోధించడంలో వ్యక్తులను గుర్తించడానికి, సమీక్షించడానికి, సమాచారాన్ని ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.
 
ఈ ప్రచారాన్ని ప్రారంభించడంపై డైరెక్టర్, పబ్లిక్ పాలసీ ఇండియా, మెటా- శివనాథ్ తుక్రాల్ మాట్లాడుతూ, “ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారంతో పోరాడేందుకు మెటా కట్టుబడి ఉంది. తప్పుడు క్లెయిమ్‌లను తొలగించడానికి, ఏఐ- రూపొందించిన తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి వాట్సాప్ టిప్‌లైన్‌ని ప్రారంభించడానికి ఎంసిఏతో భాగస్వామ్యం చేసుకోవడంతోపాటు విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో పౌరులకు సహాయపడే స్వతంత్ర ఫ్యాక్ట్ -చెకర్ల యొక్క బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వంటి పరిశ్రమ ప్రముఖ ప్రోగ్రామ్‌లలో మేము పెట్టుబడి పెట్టాము. ఈ  ప్రచారం అనేది తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని నిరోధించడానికి మా కొనసాగుతున్న ప్రయత్నాలకు కొనసాగింపు, దానిని ఎదుర్కోవడంలో వారు పోషించగల పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సులభమైన భద్రతా మార్గదర్శిగా పనిచేస్తుంది” అని అన్నారు.
 
గత వారమే, ఏఐ - రూపొందించిన తప్పుడు సమాచారాన్ని- ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను ఎదుర్కోవడానికి, ధృవీకరించబడిన, విశ్వసనీయ సమాచారంతో కనెక్ట్ అవ్వడంలో వ్యక్తులకు సహాయపడే ప్రయత్నంలో వాట్సాప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. థర్డ్-పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్ కోసం సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (SRO)ని ఏర్పాటు చేయడానికి క్రాస్-ఇండస్ట్రీ, మల్టీ-స్టేక్‌హోల్డర్ నేతృత్వంలోని తప్పుడు సమాచార పోరాట కూటమి (MCA) కార్యక్రమంకు కూడా మెటా మద్దతు ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments