Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో జియో ఫోన్-2 ఫ్లాష్ సేల్... రూ.2999కే 4జీ ఫోన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:08 IST)
రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ (జియో-2 ఫోన్)ను సమ్మర్ ఫ్లాష్ సేల్ పేరుతో ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభించింది. ఈ సేల్‌లో జియో ఫోన్ కేవలం రూ.2,999కే లభించనుంది. ఈ విక్రయాలు కూడా గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. 4జీ నెట్ వర్క్‌తో పనిచేసే జియో ఫోన్‌లోని ఫీచర్లు.. యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. క్వార్టరీ కీబోర్డ్‌తో సులభంగా మెసేజ్ చేయొచ్చునని రిలయన్స్ జియో అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. 
 
దేశీయ టెలికాం ఇండస్ట్రీలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించిన విషయం తెల్సిందే. జియో ఫీచర్ ఫోన్‌కు జియో ఫోన్2 అపగ్రేడడ్ వర్షన్. జియో ఫోన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రిలయన్స్ జియో ఫ్లాష్ సేల్స్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ జియో బ్రౌండ్‌పై టెలికం సర్వీసులను అందిస్తోంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్‌లో ఫీచర్ ఫోన్ బుక్ చేసుకోవచ్చు. జియోఫోన్ 2 బుక్ చేసుకోవాలంటే జియో వెబ్‌సైట్‌కెళ్లి లాగిన్ కావాల్సి ఉంటుంది.
 
కాగా, రిలయన్స్ జియో వెబ్‌సైట్‌లో జియోఫోన్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు నివశించే ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత మీకు నచ్చిన పేమెంట్ మోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆప్షన్‌లలో రూ.2999 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ అయితే ఈమెయిల్‌కు ఫోన్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
 
ఈ ఫీచర్ ఫోన్ 2పై వివిధ రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ఆఫర్లను కూడా రిలయన్స్ జియో ప్రకటించింది. తొలుత రూ.49, రూ.99, రూ.153, రూ.297, రూ.594 విలువతో కూడి రీచార్జ్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments