Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హేష్ మ‌హ‌ర్షి డ‌బ్బింగ్ స్టార్ట్...

Advertiesment
మ‌హేష్ మ‌హ‌ర్షి డ‌బ్బింగ్ స్టార్ట్...
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:35 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్దే న‌టిస్తోంది. ఇటీవ‌ల మ‌హేష్ బాబు పైన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. భ‌ర‌త్ అనే నేను అనే బ్లాక్‌బ‌ష్ట‌ర్ త‌ర్వాత సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇందులో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ రోజు ఈ మూవీ డ‌బ్బింగ్ ప్రారంభించారు.
 
ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి, దిల్ రాజు, అల్ల‌రి నరేష్, రచ‌యిత‌ హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ మూవీ టీజ‌ర్‌లో స్టూడెంట్‌గా క‌నిపించినా మ‌హేష్ ఇటీవ‌ల రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌లా క‌నిపించారు. దీంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచనాలు పెరిగాయి.  ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?