Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నానికి మహేష్ బాబు సోదరి మంజుల అడ్వాన్స్ మనీ....

Advertiesment
నానికి మహేష్ బాబు సోదరి మంజుల అడ్వాన్స్ మనీ....
, ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (16:42 IST)
నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నాని మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈ నెల‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ ప్రాజెక్టు తరువాత నానితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూక‌డుతున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మించ‌నున్నారు. ఇందులో నాని న‌టించ‌నున్నాడు. ఇక గీతా ఆర్ట్స్‌లో నాని హీరోగా ఒక సినిమా చేయడానికి దర్శకుడు మారుతి రెడీ అవుతున్నాడు. 
 
మహేష్‌ బాబు సోదరి మంజుల కూడా నానితో సినిమా ప్లాన్ చేస్తోంది. ఆమె అడ్వాన్స్ నాని ద‌గ్గ‌ర ఉంద‌ట‌. ఇలా.. నానితో సినిమా చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెంట‌ప‌డుతున్నారు మ‌రి.. విక్ర‌మ్ కుమార్ సినిమా త‌ర్వాత నాని దిల్ రాజు, గీతా ఆర్ట్స్, మంజుల‌... ఈ ముగ్గురిలో ఎవరి బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మికపై మనసుపడిన మాటల మాంత్రికుడు?