Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌.. హిందీతో పాటు తెలుగు, మలయాళంలోనూ..?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (17:11 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. దానికి 'జియోపేజెస్' అని పేరు పెట్టింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్‌కు ఇది అప్ డేటెడ్ వర్షన్. ఈ బ్రౌజర్ ద్వారా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. 
 
ఈ బ్రౌజర్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకూ పెద్ద పీట వేశామని జియో సంస్థ తెలిపింది. ఈ బ్రౌజర్ లో ఏదైనా సమాచారం కోసం సర్ఫ్ చేసినపుప్పుడు స్థానిక సమాచారం ముందు చూపిస్తుంది. ఆ విధంగా ఈ బ్రౌజర్ అల్గారిథన్ని సెట్ చేసినట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. 
 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్‌లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయని, వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో వెల్లడించింది. 
 
ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తన పాత బ్రౌజర్‌ను వాడుతున్న దాదాపు 1.40 కోట్ల మందినీ కొత్త బ్రౌజర్‌కు అప్‌డేట్ చేస్తామని జియో తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments