Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ప్రైమ్ మెంబర్‌షిప్.. తీసుకుంటే లాభమేంటి? తీసుకోకుంటే కలిగే నష్టమేంటి?

దేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. ఈ కంపెనీ దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఇంతటితో ముగిసి పోయిందిలే అనుకుంటే జియో మాత్రం తన ప్రత్యర్థులను వదిలిపెట్టేలా లేదు. మార్చి ఒ

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (08:40 IST)
దేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. ఈ కంపెనీ దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఇంతటితో ముగిసి పోయిందిలే అనుకుంటే జియో మాత్రం తన ప్రత్యర్థులను వదిలిపెట్టేలా లేదు. మార్చి ఒకటో తేదీ నుంచి తమ వినియోగదారుల కోసం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించింది.
 
ఆన్‌లైన్‌లో, రిలయన్స్ జియో స్టోర్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్‌ను మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది. 
 
అంతేకాదు, జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా పొందుతారు. జియో ప్రైమ్ యూజర్లకు, నాన్ జియో ప్రైమ్ యూజర్లకు వర్తించే డేటా ప్యాక్స్‌లో తేడాలివే. అంటే జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకుంటే కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తే... 
 
19 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 200 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 ఎంబీ డేటా, 1 రోజు వ్యాలిడిటీ 
49 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 300 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 300 ఎంబీ డేటా, 3 రోజుల వ్యాలిడిటీ
96 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 1 జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 600 ఎంబీ డేటా, 7 రోజుల వ్యాలిడిటీ
149 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 2 జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 1 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ
303 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 30 జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ
499 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 58 జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ
999 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments