Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ దేశభక్తి ప్రదర్శనల కోసం సైనికుడి కూతురును రేప్ చేస్తామంటారా: మండిపడ్డ గంభీర్

సైనికుడైన తండ్రిని కోల్పోయిన ఒక కుమార్తె యుద్ధ బీభత్సం గురించి పోస్ట్ చేసి శాంతి సాధన ఉద్దేశాన్ని వ్యక్తపరిస్తే.. అలా చేసే హక్కు ఆమెకు ఉంది కానీ, తామెంత దేశభక్తిపరులమో చాటిచెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ దాన్ని ఒక అవకాశంగా తీసుకోవడం, ఆమెను హేళన చేయడం ద

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (08:22 IST)
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్‌పై జరుగుతున్న దాడులపై భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ విరుచుకుపడ్డాడు. సైనికుడైన తండ్రిని కోల్పోయిన ఒక కుమార్తె యుద్ధ బీభత్సం గురించి పోస్ట్ చేసి శాంతి సాధన ఉద్దేశాన్ని వ్యక్తపరిస్తే.. అలా చేసే హక్కు ఆమెకు ఉంది కానీ, తామెంత దేశభక్తిపరులమో చాటిచెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ దాన్ని ఒక అవకాశంగా తీసుకోవడం, ఆమెను హేళన చేయడం దారుణమని గౌతమ్ గంభీర్ విమర్శించాడు.

2016లో యుద్ధ వ్యతిరేక సందేశం పంపిన కౌర్‌ పోస్టుపై మరో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్య చేశాడు. మా నాన్నను చంపింది పాకిస్తాన్ కాదు యుద్ధం చంపింది అంటూ కౌర్ చేసిన వ్యాఖ్యకు రెండు ట్రిపుల్ సెంచరీ చేసింది నేను కాదు నా బ్యాట్ అంటూ సెహ్వాహ్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యకు కౌర్ తీవ్రంగా గాయపడింది. నేను అమితంగా గౌరవించే క్రికెటర్ అలా వ్యాఖ్యానించడం గుండె బద్దలు చేసిందని కౌర్ వ్యాఖ్యానించింది.
 
ఈ వాద వివాదాలకు ప్రతిస్పందనగా గంభీర్ గురువారం తన ట్విట్టర్ ద్వారా చిరు వీడియోను పోస్ట్ చేశాడు. దానిపై టెక్స్ట్ కూడా పొందుపర్చాడు. ఆ పాఠంలో ఇలా చెప్పాడు. భారతీయ సైన్యం అంటే నాకు అత్యంత గౌరవం ఉంది. దేశానికి వారు చేస్తున్న సేవ నిరుపమానమైనది. కాని ఇటీవలి పరిణామాలు నన్ను కాస్త అసంతృప్తికి గురిచేశాయి.

మనం స్వేచ్ఛాయుత దేశంలో నివసిస్తున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం చెప్పె హక్కు ఉంది. సైనికుడైన తన తండ్రిని కోల్పోయిన ఒక కుమార్తె శాంతి సాధన ఉద్దేశంతో యుద్ధ బీభత్సం గురించి సోషల్ మీడియాలో పోస్ట్లులు పెడితే అలా చేసే హక్కు ఆమెకు ఉంది. కానీ తామెంత దేశభక్తిపరులమో చాటిచెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ దాన్ని ఒక అవకాశంగా తీసుకోవడం, ఆమెను హేళన చేయడం దారుణమని గౌతమ్ గంభీర్ విమర్శించాడు. 
 
ఆెమెకు తన అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది. అలా చెప్పినందుకు ఆమెను రేప్ చేస్తామని, చంపుతామని బెదిరించడం హీనాతిహీనమైన ప్రవర్తన. బెదిరింపులకు లోనుకాకుండా గుర్ మెహర్ కానీ, పోగట్ సిస్టర్స్ కానీ తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంది అంటూ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

గత కొద్ది రోజులుగా వీరేంద్ర సెహ్వాగ్, కుస్తీ యోధులు గీతా పొగట్, యోగేశ్వర్ దత్ వంటి క్రీడాకారులు జాతీయవాద ప్రచారకులతో చేయి కలిపి కౌర్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ వ్యాఖ్య ఆలోచనలను రేకెత్తిస్తోంది.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments