షార్ట్ వీడియోల కోసం రిలయన్స్ జియో నుంచి కొత్త యాప్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (16:08 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థల్లో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారుల కోసం మరో యాప్‌ను అదుబాటులోకి తీసుకొచ్చింది. షార్ట్ వీడియోస్ కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలోనే ఈ యాప్ కూడా ఉంది. అయితే, ఈ యాప్‌ ప్రారంభంలో తొలుత వంద మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆ తర్వాత ఇన్విటేషన్ రూపంలో ఇతరులకు ఆహ్వానం పంపిస్తారు. 
 
"వినోదాన్ని అందించే స్టార్స్‌కు ఇదొక అంతిమ గమ్యం అవుతుంది. గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్య నటులు, డ్యాన్సర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్కృతిని ప్రభావితం చేసే సృష్టికర్తలు అందరికీ ఇది గమ్యస్థానం" అని జియో ఫ్లాట్‌ఫామ్స్ ఓ ప్రటనలో తెలిపింది. 
 
ఈ షార్ట్ వీడియో యాప్ బీటా వెర్షన్‌లో బయటకు వచ్చింది. పూర్తి స్థాయి వెర్షన్ 2023 జనవరి విడుదల చేయనున్నారు. అపుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. కాకపోతే, ఆరంభంలో అందరికీ ఈ అవకాశం ఇవ్వరు. 
 
వ్యవస్థాపక సభ్యుల్లో మొదటి 100 మంది మాత్రమే ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఇన్‌వైట్ విధానంలో ఇతరులకు ఈ వేదికపైకి ఆహ్వానించవచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్ రూపంలో ఇందులో ప్రవేశం దక్కించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments