Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో నుంచి న్యూ ఇయర్ ఆఫర్స్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (17:18 IST)
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ సంస్థ వినియోగదారులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, రోజుకు 1.5జీబీ డేటా, ఇతర సదుపాయాలతో కూడిన 336 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని 29 రోజులకు పెంచి 365 రోజులు చేసింది. 
 
అంటే, జియో వినియోగదారులు ఒక యేడాది ప్లాన్ కింద రూ.2,545కు రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, జియో ఫ్లాట్‌ఫామ్‌పై ఇతర సదుపాయాలు పొందవచ్చు. ఈ ప్లాన్ పాత యూజర్లకే కాకుండా కొత్త కనెక్షన్ పొందిన వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. 
 
అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్‌కు జియో అందుబాటులోకి తెచ్చింది. రూ.2,879 రీచార్జ్‌పై 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీపీ డేటాను పొందవచ్చు. ఇందులోనూ రోజు వంద ఎస్ఎంఎస్‌లు, ఇతర సదుపాయాలు పొందవచ్చు. 
 
అలాగే 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.719, రూ.666, రూ.299 రీచార్జ్ ప్లాన్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ల కింద రీచార్జ్ చేసుకునేవారు జియోమార్ట్‌పై చెల్లింపులకు ఉపయోగపడే క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments