కెమెరా ఆన్ మొబైల్ పేరుతో జియో అద్భుతమైన ఫీచర్

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (09:38 IST)
Jio
జియోఫైబర్ యూజర్లకు రిలయెన్స్ జియో అద్భుతమైన ఫీచర్‌ను అందించింది. ఎక్స్‌టర్నల్ కెమెరా లేదా వెబ్‌క్యామ్ లేకుండానే జియోఫైబర్ యూజర్లు టీవీల ద్వారా వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 'కెమెరా ఆన్ మొబైల్' పేరుతో ఈ ఫీచర్ అందిస్తోంది. అలాగే జియోజాయిన్ యాప్ ద్వారా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ వాడుకోవచ్చు. 
 
గతంలో జియోకాల్ పేరుతో ఉన్న యాప్ జియోజాయిన్‌గా మారింది. జియోజాయిన్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లు ఉన్నవారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ యాప్ ఉపయోగించి జియోఫైబర్‌వాయిస్ ద్వారా వీడియో కాల్స్ చేయొచ్చు. 
 
జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు లభించే కాలింగ్ సపోర్ట్ ఇది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కెమెరా వెబ్‌క్యామ్‌లాగా పనిచేస్తుంది. టీవీలో వీడియో కనిపిస్తుంది. 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను చాలాకాలంగా టెస్ట్ చేస్తోంది జియోఫైబర్. ఈ ఫీచర్ సక్సెస్ కావడంతో యూజర్లకు రిలీజ్ చేసింది. 
 
స్మార్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేయడానికి ముందుగా 10 అంకెల జియోఫైబర్ నెంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జియోజాయిన్ యాప్ సెట్టింగ్స్‌లో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ ఎనేబుల్ చేయాలి. 
 
ఇక మీరు మీ టీవీ నుంచి వీడియో కాల్స్ చేయొచ్చు. వీడియో కాల్స్ క్లారిటీ బాగా ఉండటానికి మోడెమ్‌లో 5GHz వైఫై బ్యాండ్ ఆన్ చేయాలి. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాల్స్ చేయొచ్చు. జియోజాయిన్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments