జియో, వొడాఫోన్‌కు ఎయిర్‌టెల్ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. రూ.48, రూ.98 ప్లాన్‌లను నెలసరి రీఛార్జ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఉచిత డేటా పేరిట జియో సంచలనం సృష్టించిన నేపథ్యంలో వినియోగదారులను తమవైపు తిప్పుకుంది. ఆపై జియో దెబ్బకు వినియోగదారులు భారీ సంఖ్యలో పెరిగారు.
ఇందుకు ఆపై జియో ప్రకటించిన భారీ ఆఫర్లే కారణం. ఈ నేపథ్యంలో జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ టెలికాం రంగ సంస్థ నెలసరి రీఛార్జ్ చేసే వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో కొత్త రీఛార్జ్ పథకాలను ప్రకటించింది. దీని ప్రకారం రూ.48, రూ.98 ప్రీ-పెయిడ్ పథకాలను ప్రవేశపెట్టింది.
రూ.48 రీఛార్జ్ ద్వారా 28 రోజులకు 3జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.98లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 6జీబీ డేటాను 28 రోజుల వ్యాలీడిటీతో పొందవచ్చు. ఇకపోతే రూ.98లకు మాత్రం రోజు పది ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చునని ఎయిర్‌టెల్ వెల్లడించింది.