ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్... రూ.48కే ఉచిత కాల్స్

ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (08:53 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.48, రూ.98 ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు. 
 
అయితే, రూ.48 ప్లాన్‌లో 3జీబీ డేటాను, రూ.98 ప్లాన్‌లో 6జీబీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్‌లో పది ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా ఇస్తారు. నెల‌వారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ రెండు ప్యాక్‌లు స‌రిపోతాయ‌ని ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది. 
 
అలాగే రూ.29కే మ‌రో ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ అందిస్తున్న‌ది. ఇందులో 520ఎంబీ డేటా ల‌భిస్తుంది. వాలిడిటీ 28 రోజులు. ఇక రూ.92కే 6 జీబీ డేటా వ‌చ్చే మ‌రో ప్లాన్ కూడా ఉంది. కాక‌పోతే ఈ ప్లాన్ వాలిడిటీ కేవ‌లం 7 రోజులు మాత్ర‌మే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లంక పేలుళ్లు: నిఘా హెచ్చరికలు నాకు చేరలేదు... రిజైనెందుకు చేయాలి? విక్రమసింఘే