భారతీ ఎయిర్‌టెల్ నుండి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

బుధవారం, 13 మార్చి 2019 (19:17 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే రూ. 398 ప్లాన్. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 90 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సదుపాయాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 70 రోజులు మాత్రమే. కాగా జియోలో ఇదే రూ.398 ప్లాన్‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుండడం విశేషం..! 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వాట్సప్‌లో ఎస్‌బీఐ పేరుతో లింక్... ఓటీపి చెప్పారో అంతేసంగతులు...