Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్‌ జియో మరో సంచలనం?.. త్వరలో ఐపీ టీవీ ప్రసారాలు

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు.. రిలయన్స్ జియో త్వరలోనే ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీ టీవీ) ప్రసారాలను

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (10:52 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు.. రిలయన్స్ జియో త్వరలోనే ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీ టీవీ) ప్రసారాలను ప్రారంభించబోతున్నట్టు సమాచారం. అయితే, లీకేజీపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 
 
కానీ, తాజాగా ఆన్‌లైన్‌లో లీకైన సెట్‌టాప్‌ బాక్స్‌ను నిశితంగా పరిశీలిస్తే మాత్రం రిలయన్స్ జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సెట్‌టాప్‌ బాక్సులు ఉచితంగా అందించడంతో పాటు, డిటిహెచ్‌ ఆపరేటర్ల కంటే 40-50 శాతం చౌకగా ఐపిటీవీ ప్రసారాలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. 
 
ఈ ఊహాగానాలు నిజమైతే... దేశీయ టెలికాం రంగంలో మాదిరిగానే డిటిహెచ్‌ రంగంలోనూ పెద్ద కుదుపు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో ఐపీ టీవీ ప్రసారాలు ప్రారంభమైతే డీటీహెచ్ ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments