Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (10:40 IST)
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్‌ తాజా గణాంకాలు వెల్లడించాయి. జియో సేవలు అందుబాటులోకి రాకమునుపు ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
2019 నవంబర్ నాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌‌టెల్‌ నిలిచాయి. 
 
అక్టోబరు నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే, వొడాఫోన్ ఇండియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు అందిస్తున్న సేవలపై చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో అనేక మంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు వెళుతున్నారు. అయినప్పటికీ రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments