Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస

Webdunia
బుధవారం, 17 మే 2017 (19:37 IST)
అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమిళనాడులోని కాగ్నిజెంట్ కంపెనీ తొలగించిన ఉద్యోగులు ఐటీ ఫారమ్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. 
 
మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. అందులో 100 మంది మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో 2015లో టీసీఎస్ కంపెనీ వందల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో తమిళనాడు ప్రభుత్వం ఐటీ రంగాన్ని కూడా ట్రేడ్ యూనియన్‌లో చేర్చింది. ఈ విషయంలో కర్ణాటక ముందడుగు వేయలేదు. అయితే కాగ్నిజెంట్ దెబ్బతో 13వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇదే కనుక కొనసాగితే ఐటీ ఉద్యోగుల సమ్మె చేస్తామంటూ ఆ ఫారమ్ ఛీఫ్ పరిమళ హెచ్చరించారు. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుండే అత్యధిక ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments