Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫోసిస్ అదుర్స్.. ఉద్యోగులకు శాలరీ హైక్, ప్రమోషన్లు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:47 IST)
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత కనిపిస్తోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ వంటి కంపెనీ శాలరీ హైక్, ప్రమోషన్లు ఇవ్వనుంది.
 
గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార అనిశ్చితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తోందని ఇటీవల సలీల్ పరేఖ్ ఈటీ-నౌ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, భారత్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
 
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఏప్రిల్ నెలలో కరోనా కారణంగా శాలరీ హైక్, ప్రమోషన్లు హోల్డ్‌లో ఉంచింది. అయితే ఆ తర్వాత కొంతమంది ఉద్యోగులకు హైక్స్ విషయంలో ఊరట కల్పించింది. అప్పుడు శాలరీ హైక్స్, ప్రమోషన్లు నిలిపివేసినప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments