విదేశీ ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆంక్షలు.. ఎందుకంటే...

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (10:18 IST)
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారు చేసే గాడ్జెట్స్‌ను ప్రోత్సహించే చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాలైన గాడ్జెట్స్‌పై కేంద్రం అంచలంచలుగా ఆంక్షలు విధిస్తుంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లపై ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తుంది. 
 
ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై 2025 జనవరి తర్వాత పరిమితి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంతో నేరుగా సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని పేర్కొంది. వీటి దిగుమతులపై ఆంక్షలు విధిస్తే, యాపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో సత్వరం తయారీ పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఒకవేళ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఇప్పటివరకు వీటి దిగుమతులపై భారీగా ఆధారపడిన ఐటీ హార్డ్‌వేర్‌ మార్కెట్‌ ధోరణి మారిపోవచ్చు. ఈ నిర్ణయంతో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు 84,000 కోట్ల) మేరకు ఈ పరిశ్రమపై ప్రభావం పడుతుందని అంచనా. వీటి దిగుమతులపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఇంతకుముందే వచ్చింది. అయితే అమెరికా కంపెనీల నుంచి బలమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశీయంగా తయారీ ప్రారంభించేందుకు కంపెనీలకు తగిన సమయం ఇచ్చినట్లు ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments