భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్-15 విక్రయాలు.. క్యూ కట్టిన కస్టమర్లు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:47 IST)
భారత్‌లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు శుక్రవారం నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఐఫోన్ స్టోర్లకు క్యూ కట్టారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్‌లోని యాపిల్ బీకేసీ స్టోర్‌తో పాటు ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ఉన్న యాపిల్ సాకేత్ స్టోర్‌ ముందు యాపిల్ ఐఫోన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 
 
యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌. భారత్‌ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 కాగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను రూ.1,59,900కి విక్రయించనుంది.  
 
లాంఛ్‌ ఆఫర్‌ కింది హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసేవారికి ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఐఫోన్ 15  ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ కొనుగోలు చేసేవారికి రూ.6,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. 
 
ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌-ఇన్‌ బెనిఫిట్‌ కింద డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు ఐఫోన్ 15 అమ్మకాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments