Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జియో' జింతాత్త జితా జితా... ఇక ఇండియాలో ఆ ఫోన్లు తప్ప ఏ ఫోన్లు కొనేవాళ్లుండరా...?

రూ.0 కే జియో స్మార్ట్ ఫోన్. ఇక ఈ ఫోను మార్కెట్లోకి వస్తే మిగిలిన కంపెనీల ఫోన్లు కొంటారా...? డౌటే. ఇంతకీ ఈ ఫోన్ ఫీచర్లు ఏమిటో ఒక్కసారి చూద్దాం. జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన రిలయన్

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (17:31 IST)
రూ.0 కే జియో స్మార్ట్ ఫోన్. ఇక ఈ ఫోను మార్కెట్లోకి వస్తే మిగిలిన కంపెనీల ఫోన్లు కొంటారా...? డౌటే. ఇంతకీ ఈ ఫోన్ ఫీచర్లు ఏమిటో ఒక్కసారి చూద్దాం. జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆ ఫోన్ ప్రత్యేకతలను స్వయంగా వివరించారు. వచ్చే ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆనాటి నుంచి ఏ ఒక్కరూ వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని, ఉచితంగా ఎన్ని నిమిషాలైనా, గంటలైనా మాట్లాడుకోవచ్చని ప్రకటించారు.
 
అన్ని జియో అప్లికేషన్లు ముందుగానే ఇందులో లోడ్ చేసి ఉంటాయని, జియో సినిమా, జియో మూవీ, జియో టీవీ యాప్స్‌తో పాటు వాయిస్ కమాండ్, ప్రాంతీయ భాషల్లో సందేశాలు పంపుకునే వీలు కూడా ఉంటుందని తెలిపారు. అలాగే, నచ్చిన పాటను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చన్నారు. 
 
ఫోన్‌లో 5వ నంబర్ ఎమర్జెన్సీ బటన్‌గా పని చేస్తుందని, ఎమర్జెన్సీ లొకేషన్‌ను షేర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకతని ముఖేష్ పేర్కొన్నారు. 4జీ ఫీచర్ ఫోన్‌లో నెలకు కేవలం రూ.153కు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తామని, వాయిస్ కాల్స్ ఎన్ని చేసుకున్నా ఉచితమేనని, ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితమని ముఖేష్ తెలిపారు. ఈ ఫోన్‌ను ఆగస్టు 24వ తేదీ ప్రిబుకింగ్స్ ప్రారంభిస్తామని, సెప్టెంబరులో ఫోన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. వారానికి కనీసం 50 లక్షల ఫోన్లను అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు.
 
ఈ అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయన ప్రకటించారు. అయితే ఉచితాన్ని మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దీనిని మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అంబానీ స్ప‌ష్టం చేశారు. 4జీ ఎల్‌టీఈ ఫోన్ మొత్తం వాయిస్ క‌మాండ్స్‌తోనే ప‌ని చేస్తుంది. ఫోన్ చేయాల‌న్నా.. మెసేజ్ పంపాల‌న్నా.. జియో యాప్స్‌ను యూజ్ చేయాల‌న్నా అన్నీ వాయిస్ క‌మాండ్స్‌తోనే ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. దేశంలోని అన్ని భాష‌ల‌ను ఈ ఫోన్ అర్థం చేసుకుంటుంది. 
 
ఇదో ఇంటెలిజెంట్ స్టార్మ్‌ఫోన్ అని అంబానీ ఈ సంద‌ర్భంగా చెపుతూ... ఈ 4జీ ఎల్‌టీఈ ఫోన్ అన్ని భాష‌ల‌ను అర్థం చేసుకుంటుందన్నారు. మొత్తం 22 భాషలు ఇందులో ఫీడ్ అయి వున్నాయన్నారు. ఈ ఫోన్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్ ఏమిటంటే ఒత్తిడిలో కుంగిపోయి, ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు వ‌చ్చేవారు ఫోన్‌లోని 5 నంబ‌ర్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే, అందులో సెల‌క్ట్ చేసి ఉంచిన మ‌న ద‌గ్గ‌రి వాళ్ల‌కు ఆ సందేశం వెళ్తుంది. లొకేషన్ కూడా చెప్పేస్తుంది. ఇలా పలు కీలక ఫీచర్లు వున్న ఈ ఫోన్లను భారతీయులందరికీ అందించింది డిజిటల్ డెమొక్రసీ తీసుకురావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు ముకేష్. మరి ఇన్ని ఫీచర్లున్న జియో ఫోన్ మార్కెట్లోకి వస్తే ఇక వేరే కంపెనీల ఫోన్లకు 'జియో' జింతాత్త జితా జితా... కాక ఇంకేముంటుంది?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments